Magazines

అంగన్ వాడి అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తి

51 నిమిషాల క్రితం

applications
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

తుది జాబితాను జీపీల్లో ప్రదర్శన

6 నుంచి 8 లోపు అభ్యంతరాలు స్వీకరణ

నవతెలంగాణ-మల్హర్ రావు

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో అంగన్ వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మహదేవ్‌పూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నియామక పత్రాల పరిశీలన పూర్తియిందని సిడిపిఓ రాధిక, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో సోమవారం మండలంలోని తాడిచెర్ల, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, వల్లెంకుంట, ఎడ్లపల్లి, నాచారం, కొయ్యుర్ గ్రామాల అభ్యర్థుల తుది జాబితాలను సర్పంచ్లు బండి స్వామి, బండారి నర్సింగం, గడ్డం క్రాంతి, జంగిడి శ్రీనివాస్, కొండ రాజమ్మ, బొమ్మ రజిత, ఇంచార్జి ఎంపీఓ మల్లిఖార్జున రెడ్డి, టీచర్లు ప్రదర్షించారు. అభ్యర్థులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 6 నుంచి 8 లోపు రాత పూర్వకంగా గదువులోపు సిడిపిఓ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. గడువులోగా ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే ఈ జాబితాలనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్