Magazines

ప్రజావాణికి మూడు ఫిర్యాదులు

1 గంట క్రితం

Prajavani
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు ఫిర్యాదులు వచ్చాయని ఎంపీడీఓ సాయిలు తెలిపారు. అందులో రెండు భూ కబ్జాలకు సంబంధించినది కాగా.. మరోటి పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు సంబంధించినదిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు కర్రెవార్‌ రాములు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని రెవెన్యూ స్థలంలో కొనసాగుతున్న భూ కబ్జాలను వెంటనే అరికట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. అదేవిధంగా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురువుతున్నాయని తెలిపారు. ఇలాంటి అక్రమ భూ కబ్జాలపై వెంటనే అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా మద్నూర్ మాజీ సర్పంచ్ సూర్యకాంత్ ధరస్వార్ తమ సర్పంచ్ కాలంలో గ్రామ అభివృద్ధి పనులు చేపట్టిన వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. రెండు సమస్యలు పరిష్కారం కాని ఎడల కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్