నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జెండాలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్‌స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం రోడ్డుపై ధర్నా చేపట్టారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఇసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా రోడ్డుపై వాహనాల రాకపోకలకు కాసేపు ఇబ్బంది కలగడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ మెంబెర్స్, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యదర్శులు, ఎక్సక్యూటివ్ మెంబెర్స్, మాల్ మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్ లు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)