నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారజీపేట గ్రామానికి చెందిన అయిల శ్రీనివాస్ (50), గొర్రెల కాపరి అకాల మరణం చెందారు.ఆయన భువనగిరి ఎల్‌ఐసీ శాఖలో ‘జీవన్ ఆనంద్’ పాలసీ తీసుకున్నారు. సహజ మరణం నేపథ్యంలో పాలసీకి సంబంధించిన ప్రయోజనాల కింద రెండు లక్షల బోనస్ కలిపి రూ.3,14,400 మొత్తాన్ని నామినీగా ఉన్న ఆయన భార్య లక్ష్మికి ఎల్‌ఐసీ అడ్వైజర్, జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ మొరిగాడి లక్ష్మయ్య స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో చెక్కును అందజేశారు. పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించిందని,భవిష్యత్తులోనూ ఎల్‌ఐసీ కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, బండ పర్వతాలు,బండ మహేందర్,వస్పరి నరేష్, కుమారులు సిద్ధులు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)