Magazines

సర్పంచ్ మాధవరావు ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలు

48 నిమిషాల క్రితం

Bathukamma celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-మద్నూర్: సర్పంచ్ ఆధ్వర్యంలో జరిపిన బతుకమ్మ సంబరాలను చూసి గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో శుక్రవారం నాడు ఆ గ్రామ సర్పంచ్ మాధవరావు ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మను తలపై ఎత్తుకొని సర్పంచ్ ఊరేగింపుగా బతుకమ్మ ను తీసుకు వెళుతుంటే వాడవాడలో ప్రజలు సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆడపడుచులు నిర్వహించవలసిన బతుకమ్మ పండుగను గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం గ్రామ ప్రజలు ఆ సర్పంచ్ను ఎంతో సంతోషించారు. ఆయనతోపాటు పలువురు గ్రామ పెద్దలు బతుకమ్మ సంబరాలు పాల్గొనడం అందరినీ ఆకర్షింప చేశాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్