Magazines

సీఈసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

47 నిమిషాల క్రితం

Ts Utf Secretary Malka Janardhan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఎన్నికల వ్యవస్థను సక్రమంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పిసి) మద్దతు ప్రకటిస్తున్నట్లు టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, విస్తృతస్థాయిలో ఓటర్లను తొలగించే ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందున్న ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరిస్తూ 2023 లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ర్యాలీలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్