Magazines

భూముల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి

1 గంట క్రితం

land issues
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - యాచారం
మండల పరిధిలోని ధర్మన్నగూడలోని అసైన్డ్‌, పట్టా భూముల సమస్యలను పరిష్కరించాలని గురువారం గ్రామస్తులు డిప్యూటీ తహశీల్దార్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సర్వే నంబర్‌ 22.50 ఎకరాలు పొరపాటు జరిగిన విషయాన్ని డిప్యూటీ తహశీల్దార్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ స్పందిస్తూ.. ఈ పొరపాటును సరిచేయడానికి ప్రస్తుతం ఆప్షన్ ఉందనీ, కచ్చితంగా సరిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండల భాషయ్య, పెరుమాండ్ల రమేష్, మండల కృష్ణ, నాగటి నర్సింహా, అనుమాండ్ల భాగయ్య, అనుమాండ్ల రామారావు, ముక్కెరి నర్సింహా, పెతుల్ల - బోడ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్