Magazines

సిమ్లాలో సీపీఐ(ఎం) నిరసన

1 గంట క్రితం

CPIM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్, వామపక్ష పార్టీలు ఇచ్చిన దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల భవన్ కు శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడాన్ని నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) గురువారం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.


ఆ రాష్ట్ర సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర మెహ్రా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను తారుమారు చేయడానికి ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను బలహీనపరుస్తోందని ఆయన విమర్శించారు.ఎన్నికల సంఘం పనితీరులో పెరుగుతున్న జోక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరంతర ఉద్యమంలో ఈ నిరసన ఒక భాగమని మెహ్రా అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్