Magazines

టిపిటిఎఫ్ నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటి ఏకగ్రీవం

1 గంట క్రితం

TPTF
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత

నవతెలంగాణ-నెల్లికుదురు

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని  ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. టి పి టి ఎఫ్ నెల్లికుదురు మండల శాఖ అధ్యక్షులు యెడెల్లి యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు.


ప్రభుత్వం పిఆర్సి కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిటీ కాలపరిమితి దాటిన ప్రభుత్వం కాల యాపన చేస్తున్నదని విమర్శించారు. పిదప జిల్లా ప్రధాన కార్యదర్శి పి .విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్, ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి లు హాజరై ఎన్నిక నిర్వహించారు.


మండల అధ్యక్షులుగా యెడెల్లి యాకయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా సంగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కే .నవీన్, నిక్కత్ న్నిసా బేగం, హరినాథ్ బాబు, కార్యదర్శులుగా ఎం. మధుసూదన్ ,కే .సంపత్ రెడ్డి ,ఈ .మధుబాబు, ఎస్. ప్రవీణ్ కుమార్ జిల్లా కౌన్సిలర్స్ గా కే .వెంకటేశ్వర్లు , బీ .బిక్షపతి ,కే. పద్మావతి ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి. శ్రీనివాస్, సభ్యులుగా ఈ .కరుణాకర్ ,బి. సంపత్ అకాడమిక్ సెల్ కన్వీనర్ గా ఎం.డి .సలీం ,సభ్యులుగా శ్రీ శ్రీనివాస చారి, జి. మధు, జీవోల కమిటీ కన్వీనర్ గా కే. వెంకటేశం, పి .రమేష్ లు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కే .జనార్ధన్ పరిశీలకులు రవీందర్ రెడ్డిలు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్