క్వింటాలు పత్తి ధర 9 వేల 1 రూపాయి 25 పైసలు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మార్కెట్ పరిధిలోని కృష్ణా ఫైబర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు పత్తి మిల్లులో ఆదివారం పత్తి మిల్లు యజమాని కాకాని రాజేష్ ప్రత్యేక పూజలు చేసి పత్తి కొనుగోళ్ళను ప్రారంభించారు. ప్రైవేట్ పరంగా పత్తి ధర క్వింటాలుకు కృష్ణా ఫైబర్ ఇండస్ట్రీ పత్తి మిల్లు యజమాని రాజేష్ కాకాని పత్తి క్వింటాలు ధర రూ.9001.25 ప్రకటించి కొనుగోలు ప్రారంభించారు. మద్నూర్ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు ప్రైవేట్ పరంగా ప్రారంభమయ్యాయి.
ఈ కొనుగోళ్ల ప్రారంభోత్సవానికి మద్నూర్ మార్కెట్ పరిధిలోని ప్రైవేట్ పత్తి మిల్లుల కొనుగోలు వ్యాపారులు హాజరయ్యారు. మార్కెట్ పరంగా మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రామ్ చందర్ పాల్గొన్నారు ప్రభుత్వ పరంగా సిసిఐ ధర పత్తి క్వింటాలుకు 8667 రూపాయలు ఉంది. ప్రభుత్వ సిసిఐ ధరకు ప్రైవేటు కొనుగోళ్ల ధరకు క్వింటాలుకు పత్తి 304 రూపాయలు ధర ఎక్కువగా పలికింది. ఈ విధంగా చూస్తే ఈ ఏడాది ప్రభుత్వ పరంగా సిసిఐ కొనుగోళ్లకు పత్తి రాకపోవచ్చు అని ప్రైవేటుపరంగా ధర అధికంగా పలికే అవకాశాలు ఉన్నట్లు ప్రారంభ ధరలోనే తేలిపోయింది.
కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్ పత్తి యజమాని పత్తి ధర క్వింటాలుకు 9001.25 రూపాయలు ప్రకటించడం పట్ల అటు వ్యాపారులు ఇటు రైతులు సంతోషం వ్యక్తపరిచారు. పత్తి కొనుగోళ్ల ప్రారంభోత్సవంలో స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, పెద్ద ఎక్లారా సర్పంచ్, మాజీ సర్పంచ్ సురేష్, సలాబత్పూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ పెద్ద షక్కర్గా గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్, పత్తి కొనుగోళ్ల వ్యాపారాల సెట్లు, కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ అధికారులు, పత్తి రైతులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)