నవతెలంగాణ - హైదరాబాద్ : ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తాత్కాలిక నిషేధం విధించినట్లు కథనాలు వెలువడ్డాయి. నేషన్స్ లీగ్‌లో నార్వేతో మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కకపోవడంపై అసంతృప్తితో, డెన్మార్క్‌తో పోరుకు ముందు అనుమతి లేకుండా జాతీయ జట్టుతో శిబిరాన్ని వీడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కోచ్ జార్జ్ జీసస్ ఇచ్చిన మాట తప్పారని రొనాల్డో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం సహచర ఆటగాళ్లు, అభిమానులకు క్షమాపణలు చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై ఫుట్‌బాల్ ఫెడరేషన్ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఆరోపణలు నిర్ధారణ అయితే రొనాల్డోపై ఆరు నెలల వరకు నిషేధం విధించే అవకాశం ఉందని పలు కథనాలు వెల్లడించాయి.
ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోపై నిషేధం?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)