Magazines

పంటల చివరి దశలో విద్యుత్ కోతలు సరికాదు

1 గంట క్రితం

Power cuts
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

ఎండిపోయిన  పంటలకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం ఇవ్వాలి

సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య

నవతెలంగాణ-మల్హర్ రావు

వరి పంటలు చివరి దశకు చేరుకునే సమయంలో ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించడం సరికాదని, విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తూ పంటలను కాపాడాలని ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్  సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య కోరారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్ నినో వల్ల ఏర్పడినటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత దృష్ట్యా ఏర్పడిన పర్యవసానాలు, వర్షాభావం, వర్షపాతం, పంటలు నష్టపోవడం, రైతులు వారు చేసిన అప్పుల ఊబిలో కూరుకు కోవడం వరి, పత్తి, మిర్చి ఇతర చిరుధాన్యాలు ఆహార పంటలు కూరగాయల పంటలపై ప్రభావం పడిందన్నారు.


ఎల్ నీవో వల్ల ఏర్పడుతున్న కరువును నివారించేందుకు ప్రత్యేకమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలనీ, మిగిలిన పంటలను రక్షించడానికి తగిన విద్యుత్తును సరఫరా చేయాలని, కరువు నష్టపరిహారం వరి, పత్తి తదితరుల పంటలకు రూ.30 నుండి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం కింద 125 నుండి 150 రోజుల వరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పని కల్పించాలనీ, రిజర్వాయర్ల ద్వారా మధ్యతరగతి రైతులకు నీటి సరఫరాను అందించాలని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్