Magazines

రోబోటిక్స్ శిక్షణకు 20 మంది విద్యార్థుల ఎంపిక

4 రోజుల క్రితం

robotics
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

- సెన్సార్లతో వినూత్న పరికరాల తయారీ

- జిల్లా, రాష్ట్రస్థాయి సదస్సులకు అవకాశం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు రోబోటిక్స్ ప్రత్యేక శిక్షణకు ఎంపికయ్యారు. సోహం అకాడమీ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత తెలిపారు.


ఈ నెల 12న పాఠశాలలో సోహం అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోబోటిక్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన 20 మందిని ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేశారు. అకాడమీ ద్వారా రోబోటిక్స్‌పై శిక్షణ అందించి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దుతామని, వారిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా, రాష్ట్రస్థాయి రోబోటిక్స్ సదస్సులకు పంపిస్తామని అకాడమీ శిక్షకులు శివశంకర్ వివరించారు.


శిక్షణలో భాగంగా తొలిరోజు విద్యార్థులతో సెన్సార్ ఆధారిత ప్రయోగాలు చేయించారు. రైల్వే స్టేషన్లలో ఉపయోగించే ఎస్కలేటర్, వ్యవసాయంలో తడి, పొడి భూములను గుర్తించే పరికరం, హాలులోకి ప్రవేశించే వారి సంఖ్యను లెక్కించే సెన్సార్, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వంటి నమూనాలను విద్యార్థులు తయారు చేశారు. ఈ శిక్షణకు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు ఎం.లక్ష్మయ్య ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఉపాధ్యాయులు రాంమోహన్, సీఆర్‌పీ ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్