Magazines

ముధోల్‌కు ప్రత్యేక సహకార సంఘం

25 నిమిషాల క్రితం

cooperative
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

బిద్రేల్లి పీఏసీఎస్‌ పరిధి నుంచి ముధోల్‌కు విముక్తి

నవతెలంగాణ - ముధోల్ 

ముధోల్ కేంద్రంగా ప్రత్యేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు బాసర, ముధోల్ మండలాలకు కలిపి బిద్రెల్లి సహకార సంఘం ముధోల్ కేంద్రంగా కొనసాగుతున్న సహకార సంఘం నుంచి ముధోల్ మండలానికి ప్రత్యేక సంఘం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ, కొత్త సంఘాల ఏర్పాటుకు సంబంధించిన అనుబంధ జాబితాలో ముధోల్‌కు చోటు కల్పించింది.


తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన మెమో నెం.8983/COOP.II/1/2024 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా 240 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం బిద్రెల్లి సహకార సంఘం పరిధిలో బాసర, ముధోల్ మండలాల రైతులు ఉండటంతో సహకార సేవల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముధోల్‌ మండలానికి ప్రత్యేక పీఏసీఎస్‌ ఏర్పాటు అయితే మండల రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ఇతర సహకార సేవలు మరింత చేరువ కానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్