Magazines

గంగారంలో చేయూత పింఛన్ల పంపిణీ

15 నిమిషాల క్రితం

pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

- 63 మంది అర్హులకు పింఛన్లు మంజూరు

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మండలం గంగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన చేయూత పింఛన్ల సంబురాల వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో,  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దాసరి మధుమోహనరెడ్డి (మధుబాబు) ప్రత్యేక కృషితో గ్రామానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరయ్యాయి. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ఈ చేయూత పింఛన్లను గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.


ఈ సందర్భంగా జరిగిన వేడుకలో సర్పంచ్ కాకర్ల రేవతి మాట్లాడుతూ..ఎన్నికల హామీలకు అనుగుణంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కావేటి అప్పారావు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో దాసరి మధుమోహనరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, కులవృత్తుల వారికి పింఛన్లు మంజూరు చేయించడం ఎంతో అభినందనీయమని, ఇవి పేదలకు ఎంతో అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామంలో ఒకేసారి 63 మందికి పింఛన్లు మంజూరు కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాగమయి దయానంద్, దాసరి మధుమోహనరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ కార్యదర్శి రవి, ఉప సర్పంచ్ బెజవాడ రాధ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్