Magazines

రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ కలయిక..!

17 నిమిషాల క్రితం

Mla Jaare
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట 

నియోజకవర్గంలోని దమ్మపేట మండల పర్యటనలో భాగంగా తాటిసుబ్బన్నగూడెం గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నివాసానికి వెళ్లిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆయనను ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు, పరస్పర గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు.

రాజకీయ విభేదాలు వేరైనా.. 

రాజకీయ విభేదాలు వేరైనా మానవ సంబంధాలు, ఆత్మీయతలు వేరని చాటిన ఈ కలయిక స్థానికంగా ఆసక్తిని కలిగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్