Magazines

జాతీయ కార్మిక సమ్మేళనానికి ఏఐటీయూసీ నాయకుల ఎంపిక

2 గంటల క్రితం

AITUC
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తిమ్మాజిపేట

బెంగళూరులో ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే 43వ జాతీయ కార్మిక మహాసభల సమ్మేళనానికి ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బీజ్జా శ్రీనువాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ ఎంపికయ్యారు. ఈ సమ్మేళనంలో దేశంలో కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్ అమలు అనంతరం పర్యవసానాలు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, కార్మిక హక్కులు, కనీస వేతనాల అమలు వంటి కీలక అంశాలపై ఐదు రోజుల పాటు చర్చలు జరుగుతాయన్నారు. ఇలాంటి కీలక సమ్మేళనానికి ఎంపిక చేయడంపై ఏఐటీయూసీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి జిల్లా అధ్యక్షులు బీజ్జ శ్రీనివాసులు మారేడు శివశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్