- గ్రామీణ ప్రాంతాల్లో విచ్చల విడిగా గుడుంబా తయారీ...
- విక్రయాలపై అధికారుల నిఘా ఏదీ? ప్రజల ఆరోగ్యంపై ఆందోళన...
నవతెలంగాణ-కుభీర్: మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో విచ్చల విడిగా గుడుంబా అక్రమ తయారీ, విక్రయాలపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల వాసులు కోరుతున్నారు. అక్రమంగా తయారయ్యే కల్తీ మద్యం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వైన్స్ దుకాణాల్లో దొరికే మద్యానికంటే తక్కువ ధరకు లభిస్తుందనే కారణంతో కొందరు కల్తీ మద్యానికి అలవాటు పడుతున్నారని, దీనివల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
అధికారుల తనిఖీలు తప్పనిసరి...
గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై దింతో ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మద్యానికి యువత భవిష్యత్తుకు ముప్పు...
మద్యం అలవాట్ల కారణంగా యువత ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల డిమాండ్...
కుభీర్ మండలంలోని గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)