- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు
- సత్తుపల్లిలో సామినేని రామారావు ప్రథమ వర్ధంతి సభ
నవతెలంగాణ-సత్తుపల్లి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు అడ్డుకోవాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు అన్నారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామినేని ప్రథమ వర్ధంతి సభను స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో నిర్వహించారు. ముందుగా సామినేని చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో పాండురంగారావు మాట్లాడారు. సామినేని రామారావు హత్యోదంతానికి న్యాయం జరిగే వరకు
పోరాడతామన్నారు. కేసును భ్రష్టు పట్టిస్తున్న ఖమ్మం సీపీని సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై వెంటనే 'సిట్' విచారణ జరిపించి అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రామారావు హత్య కేసు విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నాలను నిరసిస్తూ సత్తుపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిష్పక్షపాత విచారణ జరిపి హత్యకు బాధ్యులైన
వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సామినేని వర్ధంతి సభలో రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, మోరంపూడి వెంకటేశ్వరరావు, చావా రమేష్, ఎస్‌కే వలీ, ఎస్‌కే బాషా, రామారావు, రాము, జిలానీ, భాస్కర్, రఫీ, బాబు, సైదా పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో గంగారంలో వర్ధంతి సభ
సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని గంగారంలో సామినేని రామారావు ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంతాప సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామినేని రామారావు జీవితాంతం పేదలు, కార్మికులు, కర్షకుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలపై ఆయన సాగించిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. రామారావు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గంగారం ప్రజా సంఘాల కార్యాలయంలో మండల కమిటీ సభ్యులు అయినంపూడి సనందనరావు అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలో మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, తడికమళ్ల రామకృష్ణ, దాట్ల రాంబాబు, తోటకూర వెంకట్రావు, పోలాసి భాగ్యమ్మ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)