నవతెలంగాణ - అశ్వారావుపేట
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడెమిక్స్ ఆధ్వర్యంలో, హెచ్‌డీఎఫ్‌సీ సహకారంతో బుధవారం ఒకరోజు ప్రాక్టికల్ రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తొలిసారిగా రోబోటిక్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రాక్టికల్ రోబోటిక్స్ విద్యను పరిచయం చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో 8, 9 తరగతులకు చెందిన 135 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
రోబోటిక్స్ ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, మోటార్లు, సర్క్యూట్ బిల్డింగ్, రోబోటిక్ పార్ట్స్ వినియోగం తదితర అంశాలపై ప్రత్యక్ష శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత మాట్లాడుతూ, విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు రూపొందించడం, రోబోటిక్ మోడళ్లను నిర్మించడం ద్వారా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్నారని తెలిపారు. ఇటువంటి శిక్షణలు విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం, జట్టు భావన, సాంకేతిక ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేస్తాయని అన్నారు. రాబోయే ఇన్నోవేషన్ మేళాలు, వివిధ ఇన్నోవేషన్ చాలెంజ్‌లలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించినట్లు తెలిపారు.
శిక్షణ ముగింపులో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పాఠశాలలో రోబోటిక్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగేందుకు రోబోటిక్స్ ప్రాక్టీస్ కిట్‌ను పాఠశాల బాధ్యులకు అందించారు. సామా వినయ్ నేతృత్వంలోని శిక్షక బృంద సభ్యులు లోకేష్, చెన్నకేశవులు, వెంకటదుర్గా సాయి, మణికంఠ, హరీష్, అఖిల్ వర్మ, రాజేష్ ధనుష్ శిక్షణ అందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణ అందించిన బృంద సభ్యులకు ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.







కామెంట్‌లు (0)