- మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
- మానవత్వంతో స్పందించిన ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితమ్మ
నవతెలంగాణ - ఆలేరు రూరల్ : ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి బీర్ల ఫౌండేషన్ మానవత్వాన్ని చాటుకుంది. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలకుంట్ల గండమ్మ ఇటీవల మృతి చెందగా..ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితమ్మ మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి అండగా నిలిచారు. కష్టకాలంలో నిరుపేద కుటుంబానికి చేయూత అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ బీర్ల ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బీర్ల అనితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతి మధు,గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకు నాగరాజు,వార్డు సభ్యుడు దూడల సంతోష్ గౌడ్, కంతి బిక్షపతి, బోదసు నర్సింగరావు, మాజీ ఉపసర్పంచ్ పుట్టల కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకు శ్రీశైలం,పుట్టల స్వామి, ఆలకుంట్ల చిన్న ఎల్లయ్య, జేరిపోతుల మల్లేష్, చిలుకు శ్రీను, యువజన నాయకులు దూడల శ్రీను, దూడల వేణుగౌడ్, దూడల మధు, దూడల రంజిత్, కంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)