నవతెలంగాణ- ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య చికిత్స కోసం మంగళవారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు సమస్యకు చికిత్స అందించారు. అనంతరం తిరిగి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2022లో అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్‌ఖాన్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మూడేళ్లకు పైగా జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కుడి కంటిచూపు గణనీయంగా తగ్గిందని ఆయన తరఫు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం తిరిగి జైలుకు తీసుకురావడం ఇదే తొలిసారి. మరోవైపు, ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన భార్యను కలిసేందుకు న్యాయ బృందాన్ని అనుమతించాలని పాకిస్థాన్ కోర్టు జైలు అధికారులను ఆదేశించినట్లు ఆయన పార్టీ పీటీఐ వెల్లడించింది. పార్టీ డిప్యూటీ చైర్మన్ షా మహమూద్ ఖురేషీని కూడా ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.






కామెంట్లు (0)