Magazines

వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ మహిళా నేతలు..

1 గంట క్రితం

marrige
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంకు చెందిన జుజ్జరపు వెంకటేశ్వరరావు- సునీత దంపతుల కుమారుడు సాయి తేజ వివాహం జాహ్నవితో సోమవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్ - నాగ శేష పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఉదయజ్యోతి - డాక్టర్ ప్రసాద్, వగ్గెల్ల పూజ వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కానుక అందజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, అన్యోన్యంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు జుజ్జరపు శ్రీరామమూర్తి, జుజ్జరపు రాంబాబు, జిమ్మిగూడెం మాజీ సర్పంచ్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్