Magazines

అర్హులందరికీ చేయూత పెన్షన్లు

2 గంటల క్రితం

Cheyutha pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 
జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు సహకారంతో అర్హులందరికీ చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని పెద్ద ఎక్లారా సర్పంచ్‌ మహేష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం గ్రామంలోని 34 మంది అర్హులకు చేయూత పెన్షన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పెన్షన్‌లు అందలేదనీ, ప్రజా ప్రభుత్వంలోనే సంక్ష‍ేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం పెన్షన్‌ పత్రాలు పొందిన వారు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు  గ్రామ ప్రజలు నూతనంగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్