Magazines

హౌసింగ్ బోర్డు కాలనీలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

4 గంటల క్రితం

congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నాచారం: భారత తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గురువారం హౌసింగ్ బోర్డు కాలనీ కమాన్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలేపాక అంజయ్య అధ్యక్షతన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను, దేశ సమగ్రత కోసం ఆమె చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, అంజిరెడ్డి, సీతారామరెడ్డి, గడ్డం యాదగిరి, జమీలా బేగం, కాప్రా సాయి, కిట్టు, మహేష్, రాజు, డివిజన్ ఇన్‌చార్జి అజీజ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, మల్లికార్జున్, ఉదయ్, మొసలి శ్రీనివాస్ రెడ్డి, జెమినీ, విక్టరీ జోష్ సమ్మయ్య, సురేష్ గౌడ్, బాలకృష్ణ, శ్రీకాంత్, రూపేందర్, వెంకన్న, కాంతారావు, కృష్ణ నాయక్, కోట అంజయ్య, జానీ, టిల్లు, శివతో పాటు మహిళా నాయకురాళ్లు సునీత, రాణి, ప్రభ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్