Magazines

ఢిల్లీ నిరసనలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

4 గంటల క్రితం

Delhi protest
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-టేకుమట్ల

ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆదివారం న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి మండల నాయకులు బయలు దేరారు. ఆదివారం ఢిల్లీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి నియోజకవర్గంలోని వివిధ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుతో కలిసి ఢిల్లీకి చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా కాంగ్రెస్ శ్రేణులు తమ గళాన్ని ఢిల్లీలో వినిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి శాస్త్రాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్