Magazines

తక్కువ నీటితో సాగు చేసుకోవాలి: ఏఓ సారిక

4 గంటల క్రితం

Cultivation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్

ఈ ఏడాదిలో ఎల్ ని నో ప్రభావం వల్ల మండలంలో అతి తక్కువ వర్ష పాతం నమోదు కావడంతో రైతులు రాభి సీజనలో మొక్క జొన్న, పంటలను సాగుచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి సారిక రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన కుభీర్ తో పాటు గోడపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఖేత్ బచ్చావ్ అభియాన్ పై రైతులకు అవగహన సదస్సు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి అధికారులు సారిక, సందేశ్ మాట్లాడుతూ,గ్రామమలో ఉన్న రైతులు మట్టి సంరక్షణ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. దింతో ఈ ఏడాదిలో తక్కువ నీటితో సాగు ఆయ్యే పంటలు అంతే నువ్వులు, శనగ వంటి పంటలను సాగుచేసుకోవాలన్నారు. అదే విదంగా ఎల్ ని నో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో  నీటిని పొదుపు చేసుకోవాలని ప్రజలకు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి జాదవ్ మాధవ్, సర్పంచ్ పల్లవి దత్తహరిపటేల్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్