Magazines

నట్టల నివారణ కొరకు మందుల పంపిణీ 

2 రోజుల క్రితం

Aleru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు మున్సిపాలిటీలొ దూడల నట్టల నివారణ  కొరకు  మందుల పంపిణి కార్యక్రమం,  మున్సిపల్ చైర్మన్ బీజాని బాలమణి భాస్కర్, సోమవారం, మండల పశు వైద్యాధికారి డాక్టర్ చైతన్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ పశువులలో వచ్చే వ్యాధుల నివారణ కొరకు, అన్ని రకాల వైద్య సేవలు మండల రైతులకు అందిస్తున్నామని చెప్పారు. నవంబర్ రెండవ తేదీ నుండి  ఏడవ తేదీ వరకు రైతుల  పాడి గేదే ఇతర పశువుల   వద్దకే వైద్య సేవలు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 75 దూడలకు  నట్టల నివారణ కొరకు మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్వామి, శ్రావణ్,

రైతులు లక్కాకుల సుభాష్, మొరిగాడి జలంధర్, రాజబోయిన జలంధర్, కొండా సాయి రెడ్డి, బీజాని మహేష్, మోరిగాడి లత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్