Magazines

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

1 గంట క్రితం

si
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

- డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో వాహనదారులకు పోలీసుల అవగాహన

నవతెలంగాణ - అశ్వారావుపేట : మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అశ్వారావుపేట పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. సోమవారం అదనపు ఎస్‌ఐ దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అజాగ్రత్త డ్రైవింగ్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని దేవ్‌సింగ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించినప్పుడు వాహనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్