Magazines

అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

5 గంటల క్రితం

suicide
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్ 

 అప్పుల భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముధోల్ మండలంలోని వడ్తాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ  బిట్ల పెర్సెస్, గ్రామస్తుల కథనంప్రకారం.. వడ్తల్ గ్రామానికి చెందిన గాజుల పండరి (42) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ అవసరాల కోసం ఇటీవల కొత్త ట్రాక్టర్‌, రోటవేటర్‌తో పాటు ఇతర వ్యవసాయ సామగ్రిని కొనుగోలు చేశాడు.


వీటి కోసం ప్రభుత్వ, ప్రయివేటు మార్గాల్లో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు‌. అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పండరి శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్