- అశ్వారావుపేట, అప్పారావుపేట ఆయిల్‌పామ్ నర్సరీల ద్వారా మొక్కల పంపిణీ
- జిల్లాలో 3.76 లక్షల మొక్కల పంపిణీ..
- 6,598 మంది రైతులకు లబ్ధి
- ఆయిల్ ఫెడ్ డీఓ శబావత్ శంకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రబీ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అశ్వారావుపేట, అప్పారావుపేట ఆయిల్‌పామ్ నర్సరీల ద్వారా రైతులకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 29 నాటికి జిల్లాలోని వివిధ నర్సరీల ద్వారా 3,76,096 మొక్కలను 6,598 మంది రైతులకు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేటలో 1,84,280 మొక్కలను 3,233 మంది రైతులకు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 1,21,976 మొక్కలను 2,140 మందికి అందించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ పంపిణీ కొనసాగుతోంది.
తదుపరి కార్యాచరణలో భాగంగా అప్పారావుపేట, అశ్వారావుపేట నర్సరీలతోపాటు సిద్దిపేట, మహబూబాబాద్, యాడాది భువనగిరి ప్రాంతాల్లోని నర్సరీల ద్వారా రైతులకు మొక్కలను అందించే ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 5,74,389 మొక్కలను 10,077 మంది రైతులకు పంపిణీ చేసినట్లు వివరాలు పేర్కొంటున్నాయి.
రైతులకు సూచనలు:
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత తగినంత తేమ ఉండేలా నీటి యాజమాన్యం పాటించాలి. పంటల ఎదుగుదలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లా వారీగా ఆయిల్‌పామ్ మొక్కల పంపిణీ వివరాలు |
జిల్లా | పంపిణీ చేసిన మొక్కలు | లబ్ధి పొందిన రైతులు | ||
1. | భద్రాద్రి కొత్తగూడెం | 1,84,280 | 3,233 | |
2. | ఖమ్మం | 1,21,976 | 2,140 | |
3. | సిద్ధిపేట | 15,300 | 268 | |
4. | కరీంనగర్ | 8830 | 155 | |
5. | యాదాద్రి భువనగిరి | 9360 | 164 | |
6. | మహబూబాబాద్ | 8320 | 146 | |
7. | జనగామ | 6200 | 109 | |
8. | హనుమకొండ | 9450 | 166 | |
9. | సూర్యాపేట | 8740 | 153 | |
10. | జోగులాంబ గద్వాల | 3640 | 64 | |
మొత్తం | 3,76,096 | 6,598 |
రాబోయే రోజుల్లో పంపిణీ చేయనున్న మొక్కల వివరాలు |
క్రమ సంఖ్య | జిల్లా | మొక్కల సంఖ్య | రైతుల సంఖ్య |
1. | మహబూబాబాద్ | 1,14,050 | 2,001 |
2. | సిద్ధిపేట | 1,38,418 | 2,428 |
3. | యాదాద్రి భువనగిరి | 73,416 | 1,288 |
4. | భద్రాద్రి కొత్తగూడెం | 2,48,505 | 4,360 |
మొత్తం | 5,74,389 | 10,077 |







కామెంట్‌లు (0)