Magazines

తాడిచర్ల జూ.కళాశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

11 నిమిషాల క్రితం

eye camp
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ భూపాలపల్లిలోని కిరణ్ హాస్పిటల్ సౌజన్యంతో గురువారం కళాశాల విద్యార్థుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారని, ఈ శిబిరంలో విద్యార్థుల కంటిచూపుకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్స్ పల్ విజయదేవి తెలిపారు. శిబిరం ఏర్పాటుపై ప్రిన్స్ పల్, అధ్యాపక బృందం లయన్స్ క్లబ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ తరఫున వైద్యులు కిరణ్, రవీందర్ రెడ్డి, సుదర్శన్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ రక్షిత, మొగిలి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్