Magazines

సత్తుపల్లి వరద బాధితులకు 'సింధు హాస్పిటల్స్' ఆర్థికసాయం 

56 నిమిషాల క్రితం

Sindhu Hospitals
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

- మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తికి స్పందించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి

- ​96 బాధిత కుటుంబాలకు రూ. 6.40 లక్షల ఆర్థిక చేయూత

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన కృషి ఫలించింది. ​వరదలతో నిత్యావసర వస్తువులు, ఇంటి సామగ్రి దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను సండ్ర వెంకట వీరయ్య స్వయంగా పరామర్శించి, తొలుత నిత్యావసర సరుకులు, 10 కిలోల బియ్యం, రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.


అనంతరం బాధితులకు మరింతగా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వరద బాధితులకు సాయం అందించాలని రాజ్యసభ సభ్యులు, హెటెరో గ్రూప్, సింధు హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డికి  విజ్ఞప్తి చేశారు. ​సండ్ర విజ్ఞప్తికి మానవతా దృక్పథంతో స్పందించిన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి సింధు హాస్పిటల్స్ తరఫున సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ​ఇందులో భాగంగా ఇళ్లు నీటమునిగి నష్టపోయిన 96 బాధిత కుటుంబాలకు రూ.6,40,000 ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ బాధితులకు రూ. 10 వేలు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బాధితులకు రూ. 5వేలు చొప్పున ఈ సాయం అందింది. ​ఆపద సమయంలో బాధితులకు అండగా నిలిచిన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డికి, ఆర్థిక సాయం అందేలా కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వరద బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.

బాధితుల కష్టాలను గుర్తించి సహాయం అందేలా కృషి చేసిన సండ్ర వెంకట వీరయ్యను, ఉదారంగా ఆర్థిక సాయం అందించిన బండి పార్థసారథి రెడ్డిని స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎస్.కె చాంద్ పాషా గుండ్ర రాఘవేంద్ర, అద్దంకి అనిల్ కుమార్, మల్లూరు అంకమరాజు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్