Magazines

తాడిచర్లలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

17 నిమిషాల క్రితం

Indira Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో భారత దేశ తొలి మహిళ ప్రధాని భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇందిరాగాంధీ తొలి ప్రధానిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకురాలుగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా దేశానికి సేవలందించారని కొనియాడారు. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల ఇందిరమ్మ బీమా పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్