Magazines

ఇందిరాగాంధీ సేవలు నేటి తరానికి ఆదర్శం

13 నిమిషాల క్రితం

Indira Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్

- సత్తుపల్లిలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుక

నవతెలంగాణ-సత్తుపల్లి 

ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశ ప్రజలకు చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.‌ ఈ జయంతి వేడుకలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.‌ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ పనిచేసిన కాలంలో 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయీకరణ చేసి సామాన్యులకు, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేశారని కొనియాడారు. హరిత విప్లవం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ఆహార ధాన్యాల కొరతను అధిగమించి, దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. గరీబీ హఠావో' నినాదంతో పేదరికాన్ని పారదోలడంతో పాటు వారి సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించారని తెలిపారు.


దేశ ఐక్యత, సమగ్రతను కాపాడారన్నారు. ఆమె ధైర్యసాహసాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ మాజీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు,  నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, కౌన్సిలర్లు మందపాటి ప్రభాకర్ రెడ్డి, దూదిపాల రాంబాబు, మొహమ్మద్ నసీమా షరీఫ్, విరివాడ అపర్ణ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్