Magazines

'సంజీవని' చిల్డ్రన్స్, మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం 

16 నిమిషాల క్రితం

Sanjeevani Hospital
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

- ప్రారంభకులు ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ దంపతులు 

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లిలోని బాలాజీ థియేటర్ ఎదురుగా నేతాజీ రోడ్డులో కొత్తగా అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన 'సంజీవని చిల్డ్రన్, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్' ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ బుధవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్, దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు సంజీవని చిల్డ్రన్స్ మల్టీ హాస్పిటల్ ద్వారా ఆధునిక వైద్యం అందాలని కోరారు.


పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వైద్య ఖర్చులు వారికి భారం కాకుండా, ఆస్పత్రి నిర్వహణకు ఇబ్బందులు కలగకుండా ఫీజులు తీసుకునే విషయంలో ఆలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, సంజీవని హాస్పిటల్ యాజమాన్య బాధ్యులు డాక్టర్ నాథ్ విశాల్ రెడ్డి, శ్రావ్య రెడ్డి, ఆర్. శైల కుమారి, నరసారెడ్డి పాల్గొన్నారు. 

                                                             

'సంజీవని' చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అందుబాటులో వైద్య సేవలు

- డాక్టర్ నాథ్ విశాల్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు

- డాక్టర్ శ్రావ్య రెడ్డి ఎండీ, జనరల్ మెడిసిన్

​సంజీవని చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆ ఆసుపత్రి యాజమాన్య బాధ్యులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నాథ్ విశాల్ రెడ్డి, డాక్టర్ శ్రావ్య రెడ్డి, ఎండీ, జనరల్ మెడిసిన్ తెలిపారు. 


​పిల్లల సాధారణ వైద్య చికిత్సతో పాటు నవజాత శిశు సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎన్ఐసీయూ, పీఐసీయూ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, పోషకాహార సలహాలు, అభివృద్ధి మూల్యాంకనం వంటి సేవలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల టీకాలు, ఇమ్యూనైజేషన్‌తో పాటు ఆస్తమా, అలర్జీలకు ప్రత్యేక చికిత్స తమ హాస్పిటల్ లో లభిస్తుంది అన్నారు. 24/7 అత్యవసర వైద్య సేవల విభాగం ద్వారా పిల్లలు, పెద్దలకు తక్షణ చికిత్స అందిస్తామని వివరించారు.


ఆసుపత్రిలోనే ఎక్స్-రే, ఈసీజీ, అవసరమైన రక్త పరీక్షల ల్యాబ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సౌకర్యార్థం వివిధ రకాల ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచినట్లు డాక్టర్లు నాథ్ విశాల్ రెడ్డి, శ్రావ్య రెడ్డి తెలిపారు. అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న తమ ఆసుపత్రి వైద్య సేవలను పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని వారు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్