Magazines

బేతుపల్లి పెద్ద చెరువుకు 'జలకళ'

39 నిమిషాల క్రితం

​సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు మత్తడి పడింది. దీంతో బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- మత్తడి పడి  దుంకుతున్న వైనం

- చెరువు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు మత్తడి పడింది. దీంతో బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తూములు ఎత్తి వీటిని దిగువ ప్రాంతమైన వేంసూరు మండలానికి విడుదల చేశారు. వేంసూరు మండల పరిధిలోని దాదాపు 59 సాగునీటి చెరువులకు బేతుపల్లి అదనపు  నీరు చేరే అవకాశం ఏర్పడింది. ఈ నీటి విడుదలతో వేంసూరు మండలంలోని 49 చెరువులకు బేతుపల్లి అలుగు లాకులు నుంచి నీరు చేరనుంది. నీటి ప్రవాహం, చెరువు పరిసరాల పరిస్థితులు, సాగునీటి సరఫరా తీరును అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నీటి ఉధృతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ​మరోవైపు వర్షాల ధాటికి పలు గ్రామాల్లో నేలకొరిగిన వరి పంటలను పరిశీలించి బాధితులైన రైతులతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యంతో పంటలు దెబ్బతినడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పంట నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించి నివేదికలను త్వరితగతిన సిద్ధం చేయాలని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ​ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. కాలువలు, చెరువుల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగాం ఉండాలని హెచ్చరించారు. అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటూ తక్షణ సహాయక చర్యలు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, ఏఎంసీ మాజీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, ఐబీ డీఈఈ మరియన్న, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్