Magazines

నవ్వుతూనే ఉంటారు!

29 నిమిషాల క్రితం

smiling
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవు తున్నారు. ఈనెల 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుష్మితా శెట్టి మీడియాతో ముచ్చటించారు. తొలుత‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ చేశాను. లీడ్ హీరో యిన్‌గా ఇది నా మొదటి సినిమా. ఇందులో చాలా క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశాను. కొంచెం తింగరి. హీరోని చాలా ప్రేమిస్తుంది. తన ప్రేమ కోసం ఏదైనా చేస్తుంది. తను చాలా స్మార్ట్ అనుకునే క్యారెక్టర్.

అయితే ఇందులో జరిగే క్రైమ్‌లో తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. నా క్యారెక్టర్‌ లోని ఇన్నో సెంట్‌ కామెడీ మిమ్మల్ని నవ్విస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. హీరో మౌళి చాలా టాలెంటెడ్. మా దర్శకుడికి ఇది తొలి సినిమా అయిన ప్పటికీ ఎంతో కూల్‌గా మాతో వర్క్‌ చేయించారు. సింజిత్ చాలా టాలెం టెడ్ మ్యూజిషియన్. ఇది క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి తగ్గట్టు గా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ వస్తారు. ఇందులో చాలా చాలా ఫ్రెష్ కామెడీ ఉంది. నాకు ‘మహానటి’ సినిమా చాలా ఫేవరెట్. అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాకు కూడా అలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక సినిమా చేయాలని ఉంది. అలాగే డిఫరెంట్‌ జోనర్‌ సినిమాల్లో మంచి పాత్రలు చేయాలని ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్