హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా ‘మాయలేడి’. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రశంకర్ దర్శకుడు. మధుమిత సర్కార్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ,‘రిలేషన్ షిప్ లో ఎన్నో ఎమోషన్స్ చూస్తాం. తన గర్ల్ ఫ్రెండ్ లోని డిఫరెంట్ ఎమోషన్స్ ను క్రిష్ అనే అబ్బాయి ఎలా ఫేస్ చేశాడు అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిం చాం. ఒక బంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలో భాగ స్వామికి ఉన్న సంతోషం, కోపం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలను ఎక్సిపీరియన్స్ చేయించేలా కథ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ అని భావిస్తున్నాం.
మంచి మ్యూజిక్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు చిన్న మెసేజ్ కూడా మా మూవీలో ఉంటుంది’ అని అన్నారు. ‘‘పేకమేడలు, ఎవరికీ చెప్పొద్దు’ సినిమాల తర్వాత ఫ్యామిలీ ఎలిమెంట్స్, మ్యూజిక్ కు ప్రాధాన్యత ఉండేలా ఒక ‘మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్, నిన్నే పెళ్లాడతా’..ఇలాంటి తరహాలో సినిమా ఉండాలని ప్లాన్ చేశాం. ‘ఖుషి’ సినిమాలా ఒక వైబ్ ఉన్న లవ్ స్టోరీ తెరపై చూసి చాలా కాలమవుతోంది. అలాంటి జోనర్ మూవీని నేనే పర్సనల్ గా మిస్ అవుతున్నా అనిపిం చింది. ఇది బ్లాక్ బస్టర్ అందించే స్క్రిప్ట్ అని నమ్మాను. నన్ను నిలబెట్టే సినిమా అని అనిపించింది. అందుకే ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా నా కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాను’ అని హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రె చెప్పారు.






కామెంట్లు (0)