డేంజర్ జోన్లోని కుటుంబాలకు న్యాయం చేయాలి

1 గంట క్రితం

Justice
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు భూ నిర్వాసితుల కమిటీ వినతి 

నవతెలంగాణ - మల్హర్ రావు

తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదు అంశాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని టిఎస్ జెన్క్ ఉపరితల బొగ్గుగని హద్దు నుండి 500 మీటర్ల డేంజర్ జోన్ లోని నివాస గృహాల సేకరణలో లబ్ధిదారులకు నష్టం కలగకుండా ముఖ్యమైన 5 అంశాలపై విన్నవించినట్లుగా తెలిపారు.


ప్రకటించిన విత్ పర్మిషన్ జాబితాలో గుర్తించిన 1203 ఇండ్లలో నాన్ లోకల్ వాళ్ళను గుర్తించాలన్నారు. విత్ ఔట్ పర్మిషన్ జాబితాలో గుర్తించిన 1062 ఇండ్లలో లోకల్ వాళ్ళను గుర్తించి, లోకల్ వాళ్ళను విత్ పర్మిషన్ జాబితాలో చేర్చాలని కోరారు. అలాగే నాన్ లోకల్ వాళ్ళను గుర్తించి విత్ ఔట్ పర్మిషన్ లిస్ట్ లో చేర్చాలని కోరారు. లోకల్, నాన్ లోకల్ వారిని గుర్తించడానికి స్థానిక ఎంపిడిఓ, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఏవో, ముగ్గురు అధికారులతో సంయుక్తంగా విచారణ జరిపించి నిజమైన అర్హులను గుర్తించాలని కోరారు.


పునరావాస ప్యాకేజి లోపల ఎవరి ఎవరి పేర్లు రాలేదో వాళ్ళందరి దరఖాస్తులను పునపరిశీలించి అర్హులను గుర్తించి ప్రకటించాలన్నారు. 2022 డిసెంబర్ లో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించి వెంటనే సామాజిక ఆర్థిక (సోషల్ ఏకనామికల్ ) సర్వే నిర్వహించలేదని, నాలుగు సంవత్సరాల కాలయాపన తర్వాత తేదీ: 01.07.2026న సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభించారు. కాబట్టి, ప్యాకేజి ఇచ్చే సమయానికి 18 సంవత్సరాలు నిండిన అందరిని అర్హులుగా గుర్తించాలని కోరారు.


పునరావాసం కోసం రెండు గుంటల ఇంటిస్థలం అడిగిన లబ్ధిదారులకు భూమి ఇస్తూ, భూమి వద్దు డబ్బులు కావాలనే లబ్ధిదారులకు తమ గ్రామంలో భూమికి ఇప్పుడు ఉన్న లోకల్ మార్కెట్ రేటు కన్నా 50 శాతం రేటు పెంచి చెల్లించాలన్నారు. 2012 -2013లో ప్రకటించిన 1088 ఇళ్లతో పాటు మా వారసులు కట్టుకున్న, అవసరాలకోసం కట్టుకున్న నివాస గృహాలకు ఎలాంటి పర్మిషన్ లేకున్నా ఆన్ కండిషల్ గా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, భూ నిర్వాసితులు దన్నపని అశోక్ రావు, బండి రాజయ్య, కేశారపు చెంద్రయ్య, రామిడి గట్టయ్య, తాండ్ర మల్లేష్, ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్