- ప్రకటించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ
- సత్తుపల్లి ఏరియాలో సంబురాలు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ఏరియా పరిధిలో ఉన్న సత్తుపల్లి జేవీఆర్ ఓసీ-2 బొగ్గు గనికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 5 స్టార్ (5*) రేటింగ్ అవార్డును ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై సత్తుపల్లి ఏరియాలో విజయోత్సవ సంబురాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జేవీఆర్ ఓసీ-2 అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, డీఎల్ఆర్ కార్మికులు ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
జేవీఆర్ ఓసీ -2 బొగ్గు గనికి 5 స్టార్ రేటింగ్ దక్కడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతీ ఒక్కరిని జీఎం సరికొండ వెంకటాచారి అభినందించారు. అధికారులతో పాటు కార్మికుల సమష్టి కృషి, అంకితభావం వల్లే ఈ అవార్డు సాధ్యమైందని జీఎం తెలిపారు.
అందరి సమన్వయంతో సాధించిన ఈ విజయం సంస్థకు ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో ముందుకు సాగి సంస్థ పేరును మరింత నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)