నవతెలంగాణ-ఆలేరు టౌన్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని, రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ మాజీ చైర్మన్
బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకొని బస్టాండ్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బండ్రు శోభారాణి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పేదలకు చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పస్తమ్ ఆంజనేయులు, దడిగే ఇస్తారి, కందగట్ల నిర్మల నరేందర్,అంజయ్య, ఎండి సలీం, సుధాకర్ రెడ్డి, బుచ్చి రెడ్డి, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)