మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

21 నిమిషాల క్రితం

Women
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మహిళా సాధికారత- లింగ సమానత్వం అనే అంశంపై మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థి డాక్టర్ ప్రియాంక తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్లపల్లి లోని 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పీఎం శ్రీ ఇంటర్వెన్షన్లో భాగంగా జెండర్ ఈక్విటీపై మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాణించాలని ప్రతి ఒక్క విద్యార్థిని ఒక లక్ష్యసాధన కోసం కష్టపడి శ్రమించాలి అప్పుడే తన గమ్యాన్ని చేరుకుంటారని నిర్దేశించారు. పూర్వ విద్యార్థిగా తాను కష్టపడిన తీరు, చదవడం కోసం నిర్ణీత ప్రణాళిక మరియు పటిష్టమైన పునాది పాఠశాల స్థాయిలోనే పడుతుందని దానికి ప్రతి ఉపాధ్యాయుడు  చెప్పిన అంశాలను శ్రద్ధగా ఆలపించి తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని అప్పుడే  తమ తల్లిదండ్రులు కన్న కలలు నెరవేరుతాయని పేర్కొన్నారు.


ఫార్మకోగ్నస్సి , ఫార్మకాలజీ మరియు డ్రగ్స్ తయారీ విధానాన్ని మరియు ఇతర వైద్య మరియు పారామెడికల్ కోర్సుల యొక్క ఉపయోగాన్ని ఔషధ అవసరం మరియు మోతాదుల గురించి చాలా  విఫులంగా వివరించారు. తాను ఫార్మా కాలజి డాక్టర్ కావడానికి తెలంగాణ మోడల్ స్కూల్ పూర్వ ప్రిన్సిపల్ శివశంకర్ సార్ గారి ప్రేరణే అని గుర్తు చేశారు. ప్రతి గురువు తమకు ఆదర్శం అని, వాడు బోధనలే మనకు దిశా నిర్దేశం చేస్తాయని, న్యూట్రీషన్, లైఫ్ స్టైల్,  సమతౌల్య ఆహారం, జీవన విధానాలు గూర్చి చక్కగా వివరించి విద్యార్థిని అడిగిన ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలతో సంతృప్తి పరిచారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు, సహ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కేటాయించి వచ్చిన రోల్ మోడల్ గా  మా పూర్వ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక గారిని సన్మానించి, అందరూ ఉపాధ్యాయులు తమ ఆశీర్వాదాలను, అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్