నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎలగల ఉపేందర్, కుటుంబాన్ని , శనివారం రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బండ్లు శోభారాణి పరామర్శించారు. కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం బండ్రు ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో 9 వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు, ఎండి సలీం, మోర్తాల సంజీవరెడ్డి, పత్తి రాములు, ఎలగల స్వామి, చిలువేరి సుధాకర్ రెడ్డి , కే బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)