నవతెలంగాణ-మద్నూర్
కార్తీకమాస ప్రభాత్ పేరి దేవాలయాల సందర్శన కార్యక్రమం 35వ రోజుకు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమైన ప్రభాత్ పేరికి మహిళలు వినూత్న రీతిలో జంగం మహేశ్వరులకు ప్రత్యేక ఆరతులతో స్వాగతిస్తూ వారికి దీవెనలు ఇచ్చారు.
పరంపరగా కొనసాగుతూ వస్తున్న ఈ పేరి ఇద్దరు జంగం మహేశ్వరుల ఆధ్వర్యంలో నెల రోజులు విజయవంతంగా కొనసాగింది. ప్రభాత్ పేరికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే కార్యక్రమం శనివారంతో ముగియను ఉందని జంగం మహేశ్వరులు తెలిపారు. కార్తీకమాస దేవాలయాల సందర్శన ప్రభాత్ పేరి కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా మహిళలు పురుషులు చిన్నారులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)