- ఎమ్మార్పీఎస్ నాయకులు గోళ్లమూడి శ్రీనివాసరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల బతుకులు విలవిలలాడుతున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకులు గోళ్లమూడి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
సత్తుపల్లిలో సోమవారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉప్పు, పప్పులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా రోజువారీ కూలీల ఆదాయం మాత్రం పెరగడం లేదని ఆన ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో కుటుంబ పోషణ భారమై పేద ప్రజలు పూట గడవడం కూడా కష్టంగా మారిందని, నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి, సామాన్యులకు అందుబాటు ధరలలో నిత్యావసరాలు లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు గద్దల దేవన్న, కోశాధికారి అయినపూడి సంతోష్, గంధం రాఘవులు, బొల్లెపోగు రాములు, కోట బాబురావు, నరసింహరావు
పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)