Magazines

రాజేంద్రనగర్‌లో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం

2 గంటల క్రితం

kidnapping
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ రాజేంద్రనగర్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న ఒక బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఆ విద్యార్థిని,సాయంత్రం ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడమే కాకుండా, తమ బంధువులకు ఫోన్లు చేసి వాకబు చేశారు.అయినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వారు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు.


ఓ మహిళ బాలికకు మాయమాటలు చెప్పి, ఒక యువకుడితో పంపించిందనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు,స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ బాలికను తీసుకెళ్లిన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్