Magazines

విజ్ఞాన నిలయాలు గ్రంథాలయాలు

1 గంట క్రితం

knowledge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం


ప్రారంభమైన వారోత్సవాలు


20వరకు వివిధ కార్యక్రమాలు


తాడిచెర్లలో సభ్యత్వం తీసుకున్నవారు 130


అందుబాటులో ఉన్న పుస్తకాలు 5002


నవతెలంగాణ మల్హర్ రావు

అజ్ఞానపు అంధకారం నుంచి విజ్ఞానపు జ్యోతి వెలిగించేవే గ్రంథాలయాలు.అందుకే వీటిని విజ్ఞాన భాండాగారాలని,ఆధునిక దేవాలయాలని పిలుస్తుంటారు.స్వాతంత్ర్యోద్యమ కాలంలో అసంఘటితంగా ఉన్న ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి..వారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించడంలో ముఖ్యపాత్ర పోషిం చాయి.గాడిచర్ల హరిసర్వోత్తమరావు,వట్టికోట ఆళ్వారుస్వామి..తదితర మేధావులు గ్రంథాలయాల స్థాపనకు విశేషంగా కృషి చేశారు.డబ్బులున్నా అన్ని పుస్తకాలు కొనే వీలుండదు.ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ గ్రంథాలయాలు అవసరంగా మారాయి. అన్ని రకాల పాఠకుల అభి రుచులకు అనుగుణంగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు.

ఆధునిక,సాంకేతికతను వినియోగించి ఇంటర్నెట్ ద్వారా చదువుకునే అవకాశం కూడా లైబ్రరీలు కల్పిస్తున్నాయి.నేటి సమాజంలో గ్రంథాలయాల అవసరం మరింత పెరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరు ద్యోగ యువతకు ఇవి కొండంత అండగా నిలుస్తున్నాయి.సంస్థ సైతం వారి అవసరాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసింది.ఆన్ డిమాండ్ బుక్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది.అభ్యర్ధులకు ఏ పుస్తకం అవ సరం ఉంటే ఆ పుస్తకం పేరు రిజిస్టర్ లో రాయాలని సూచిస్తోంది.ఆ తర్వాత కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతోంది.శనివారం నుంచి జిల్లా కేంద్రంలో వారోత్సవాలు నిర్వహించనున్నారు.

అందుబాటులో 5002వేల పుస్తకాలు...

తాడిచెర్ల మండల కేంద్రంలోని గ్రంథాలయంలో 130మంది సభ్యత్వం తీసుకున్నారు. 5002వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.రోజూ సగటున 40మంది మంది పాఠకులు గ్రంథాలయాలకు వచ్చి చదువుకొంటున్నారు.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం 150పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి.


ప్రారంభమైన వారోత్సవాలు


గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేయడానికి,ప్రజలు,విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి,పాఠకుల సంఖ్య పెంచేందుకు ఏటా నవంబర్ 14నుంచి 20వ తేదీవరకు వారోత్సవాలు నిర్వహిస్తారు.వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడతారు.పాఠకులు,విద్యార్థులు,మహిళలను భాగస్వాములను చేస్తారు.విద్యార్థులకు వక్తృత్వ,వ్యాసరచన,క్విజ్,రంగోళి తదితర పోటీలు నిర్వహిస్తారు.విజేతలకు ఉత్సవాల ముగింపు రోజు బహుమతులు అందజేస్తారు.ఈ నెల 20న అక్షరాస్యతా దినోత్సవంతో వారోత్సవాలు ముగిస్తారు.అయితే గతంలో మండల కేంద్రాల్లో వారోత్సవాలు నిర్వహించేవారు.బడ్జెట్ విడుదల కాకపోవడంతో జిల్లా కేంద్రంలో మాత్రమే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్