కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీల పదవీకాలం ముగిసినందున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,డిసిసి అధ్యక్షులు పున్న కైలాస్ నేత ఆదేశాల మేరకు మండలంలో గ్రామ కమిటీలు రద్దు చేయడం జరిగిందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ తెలిపారు.ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం,పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం,నిబద్ధతతో పనిచేసే నాయకులు,కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా నూతన గ్రామ శాఖ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)