Magazines

శివన్నగూడ హత్యకేసును ఛేదించిన పోలీసులు

2 గంటల క్రితం

murder case
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

అక్రమ సంబంధమనే అనుమానంతో హత్య 
నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని శివన్నగూడ గ్రామంలో శనివారం సుంకరి ఇంద్రయ్య తన భార్య రజితను దారుణంగా హత్య చేసిన కేసును మర్రిగూడ పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు ఇంద్రయ్యను ఆదివారం చాకచక్యంగా పట్టుకొని ఛేదించారు. నాంపల్లి సీఐ దూది రాజు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే ఇంద్రయ్య తన భార్య రజితను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకొనుటకు  చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రాంబాబు ను, సిబ్బంది జాంప్లా, కిరణ్, ప్రశాంత్, వహీద్, యాదయ్య లను సిఐ అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్